IND vs NZ: హమిల్టన్ వేదికగా జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా తడబడింది. కివీస్ బౌలర్లు చెలరేగడంతో టాపార్డర్ కుప్పకూలింది. అయితే ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఆదుకోవడంతో.. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. న్యూజిలాండ్ విజయం కోసం 192 పరుగుల టార్గెట్ ముందుంచింది.
స్టార్స్ ఫెయిల్.. ఇషాన్, శ్రేయస్ హాఫ్ సెంచరీలు:
భారత్ బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడే కివీస్ బౌలర్లు ఫుల్ జోష్‌లో కనిపించారు. వారి దెబ్బకి ఇండియన్ ఓపెనర్లు క్రీజులో నిలవడమే కష్టమైంది. ఈక్రమంలో ఓపెనర్ అభిషేక్ శర్మ (1), మరో ఓపెనర్ సంజు శాంసన్ (10 బంతులు ఆడి కేవలం 4 రన్స్ ) మళ్లీ నిరాశపరిచారు. ఈ సిట్యుయేషన్లో బరిలోకి దిగిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (61), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50) బాధ్యతాయుతంగా ఆడి హాఫ్ సెంచరీలతో జట్టును గట్టెక్కించారు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ కి వచ్చిన తిలక్ వర్మ (6) కూడా ఆశించిన మేర రాణించలేకపోయాడు. కానీ చివర్లో నమన్ ధీర్ (33), నితీష్ కుమార్ రెడ్డి (22) సూపర్ హిట్లు కొట్టడంతో టీమ్ స్కోర్ 191కి చేరుకుంది.
ఆడమ్ మిల్నే సూపర్ బౌలింగ్:
న్యూజిలాండ్ బౌలింగ్‌లో ఆడమ్ మిల్నే ఏకంగా 4 వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టాడు. అతనికి తోడుగా నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్ తలో 2 వికెట్లు పడగొట్టారు. మరి ఈ టార్గెట్‌ను మన బౌలర్లు డిఫెండ్ చేసుకుని సిరీస్ కొడతారా?.. లెట్స్ వెయిట్ అండ్ వాచ్!
Innings Break! A collective batting effort helps #TeamIndia set a target of 1️⃣9️⃣2️⃣ 🙌 Over to our bowlers to defend this ⏳ Scorecard ▶️ https://t.co/B5TqF9MWu4 #NZvIND https://t.co/Jm4HhjFOHO
— BCCI (@BCCI) November 1, 2026
